Rangareddy Lorry Accident : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్‌గూడ చౌరస్తా వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న దంపతులపైకి లారీ దూసుకెళ్లింది. అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. భార్యా భర్తలను ఢీ కొట్టింది. దీంతో వాహనం చక్రాల కింద పడి భర్త రత్తయ్య మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన భార్య మంజులను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బస్సుకోసం చూస్తున్న దంపతులపై దూసుకెళ్లిన కంటైనర్ లారీ.. భర్త మృతి - లారీ బీభత్సం
Lorry Accident : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడ చౌరస్తా వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
దంపతులపైకి దూసుకెళ్లిన లారీ