Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. 20మందికి గాయాలు - ఏపీ వార్తలు
Accident: ప్రకాశం జిల్లా జరగుమిల్లి మండలం బిట్రగుంట వద్ద.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారు 20మంది గాయపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనటంతో ఘటన చోటుచేసుకుంది.
Accident: ప్రకాశం జిల్లా జరగుమిల్లి మండలం బిట్రగుంట వద్ద.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో.. ఓ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 20మందికి గాయాలయ్యాయి.
నెల్లూరు నుంచి హైదరాబాద్ కు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. రహదారిపై ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్, క్లీనర్ లకు తీవ్రగాయాలుకాగా.. మరో 18 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.
ఇవీ చూడండి: