ACCIDENT : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రం వద్ద మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ వాహనానికి ముందు వెళ్తున్న పోలీసు జీపు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం వెనుక వస్తున్న టమోటా లోడ్ జీపు బోల్తా పడింది. మృతుడు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనంలోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనంకు ప్రమాదం ఏమీ జరగలేదు. ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు.
పోలీసు వాహనం ఢీ కొని వ్యక్తి మృతి - పెద్దపంజాణి
ACCIDENT : మంత్రి కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీసు వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది.
ACCIDENT