తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ రింగురోడ్డు వద్ద అమెరికా తరహా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవడానికి కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల దాని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రాణ నష్టం తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ORR Accident hyderabad today: పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్పై అమెరికా తరహా ప్రమాదం - hyd top news
పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్పై అమెరికా తరహా ప్రమాదం
10:04 November 20
పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్పై ప్రమాదం
ఇటీవలే తాను కారు కొన్నానని.. ఈ ప్రమాదంలో తన కారు బ్యానెట్ పూర్తిగా దెబ్బతిన్నదని ఓ వాహనదారుడు విచారం వ్యక్తం చేశాడు. కానీ ఎవరికీ ఏం కాలేదని ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి:
Buildings collapsed: కదిరిలో విషాదం.. భవనాలు కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Last Updated : Nov 20, 2021, 10:52 AM IST