ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: హుకుంపేట వద్ద కారు ప్రమాదం.. ముగ్గురు మృతి - తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద కారు ప్రమాదంలో ముగ్గురు మృతి

accident at hukumpeta
తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద కారు ప్రమాదం

By

Published : Jun 29, 2022, 8:44 AM IST

Updated : Jun 29, 2022, 9:22 AM IST

08:41 June 29

కుమారుల మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Accident: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనగా.. ముగ్గురు యువకులు మరణించారు. మృతులు ధవళేశ్వరానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు స్నేహితులున్నట్లు సమాచారం.

అర్థరాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 29, 2022, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details