ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దుర్గగుడిలో... మూడో రోజు అనిశా సోదాలు! - acb raids at kanaka durga temple vijayawada'

దుర్గగుడిలో మూడోరోజూ అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. అన్నదానం, టికెట్ కౌంటర్, చీరల కౌంటర్ విభాగంలో తనిఖీలు చేపట్టారు. శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ల వివరాలపై ఆరా తీశారు.

acb-officials
acb-officials

By

Published : Feb 20, 2021, 10:42 AM IST

విజయవాడ దుర్గగుడిలో మూడో రోజు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారుల సోదాలు కొనసాగాయి. టికెట్ కౌంటర్, చీరల కౌంటర్, అన్నదానం విభాగంలో అధికారులు లెక్కలు, ఇతర వివరాలను పరిశీలించారు. అంతర్గత బదిలీల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. స్క్రాప్‌ విక్రయం వివరాలపైనా దృష్టి సారించిన అనిశా బృందం.. కోట్ల విలువ చేసే స్క్రాప్‌ను రూ.లక్షల్లో విక్రయించినట్లు పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఫెర్రీలో తుక్కు విక్రయాల సొమ్ము ఏ ఖాతాలో జమ చేశారనే అంశాలపై ఆరా తీశారు.

దేవస్థానం అభివృద్ధి పేరిట నిర్వాసితులకు చెల్లించిన నగదు వివరాలపైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి పెట్టారు. శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ల వివరాలను పరిశీలించారు. ఐదేళ్లలో ఇంజినీరింగ్‌ విభాగం చేపట్టిన పనుల వివరాలను తనిఖీ చేశారు. రెండురోజుల తనిఖీల్లో సిబ్బంది నుంచి వివరాలు నమోదు చేయగా... ఈ సోదాలకు సంబంధించిన వివరాలు కొలిక్కిరాలేదు.

ABOUT THE AUTHOR

...view details