తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్గౌడ్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ కళాశాల వద్ద డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
తెలంగాణ: రూ.13 లక్షలు తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన సర్పంచి - తెలంగాణ వార్తలు
తెలంగాణలోని రాజేంద్రనగర్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ గ్రామ సర్పంచ్ వినోద్గౌడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లేఅవుట్ అనుమతి కోసం రూ.20లక్షలు సర్పంచ్ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అనిశాకు చిక్కిన మన్నెగూడ సర్పంచి
లేఅవుట్ అనుమతి కోసం సర్పంచ్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారని... రూ.13 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:డబ్బు మీద వ్యామోహంతో.. కుట్రలు, హత్యలు