అధికారిగా రూ.2లక్షలు జీతం వస్తున్నా.. రూ.30 వేల లంచానికి కక్కుర్తిపడిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ(Additional Divisional Engineer)) అనిశా(Anti Corruption Bureau)కు దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ACB raid in rangareddy district : జీతం 2 లక్షలు.. 30వేలకు కక్కుర్తి పడి.. - రంగారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారి
రూ.2 లక్షల జీతం వస్తున్నా.. రూ.30వేలకు కక్కుర్తి పడి ఓ విద్యుత్ అధికారి అనిశా(Anti Corruption Bureau) వలలో చిక్కాడు. అతణ్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టు(ACB special court)లో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా అనిశా డీఎస్పీ సూర్యనారాయణ(Rangareddy district ACB DSP) కథనం మేరకు..ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్‌లో చరణ్‌సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్, శంకర్‌పల్లి, నార్సింగ్, ఇబ్రహీంబాగ్ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తాడు. మణికొండకు చెందిన గుత్తేదారు రవి కొన్నేళ్లుగా ఆ శాఖలో చిన్నచిన్న పనులు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్తు తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం సహా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చే పనుల టెండరును ఇటీవల దక్కించుకున్నారు. అందుకు అవసరమైన అనుమతి పత్రాన్ని ఇచ్చేందుకు ఏడీఈ లంచం(Divisional engineer asked for bribe) కోరడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం గుత్తేదారు రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లారు. లంచం(bribe) సొమ్మును చరణ్‌సింగ్ తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ‘విచారణ అనంతరం ఆయన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు(ACB special court)లో హాజరుపరిచి జైలుకు తరలించామని, ఆయన ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగిస్తున్నామని’ డీఎస్పీ తెలిపారు.