తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన సలీం పాషా (21), రాంనగర్‌కు చెందిన మహ్మద్ సమీర్(20) ఓ ప్రైవేట్ ఏసీ కంపెనీలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ రాంనగర్లో నివాసముంటున్న వీరు.. బాలానగర్‌లో ఏసీ సర్వీసింగ్ చేయడానికి అందులో వాడే గ్యాస్ సిలిండర్‌తో సహా బైక్‌పై బయల్దేరారు.
బోయినపల్లి చౌరస్తా నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వెనకాల కూర్చున్న సలీం పాషా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిస్తున్న మహ్మద్ సమీర్ గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.