ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Rape and Murder: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం - abdullapurmet rape and murder news latest

మద్యం తాగిన తర్వాత స్నేహితుడి భార్యనే అత్యాచారం చేశారు నిందితులు. అంతటితో ఆగకుండా మరింత రెచ్చిపోయి హత్య చేశారు. ఈ దారుణం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

abdullapurmet rape and murder
abdullapurmet rape and murder

By

Published : Nov 23, 2021, 5:56 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌లో దారుణం (Rape And Murder) చోటు చేసుకుంది. భర్తకు మందు తాగించి.. వివాహితను అత్యాచారం చేసి.. ఆపై చంపేశారు ఇద్దరు కీచకులు. అబ్దుల్లాపూర్​మెట్​లోని ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సిద్ధమనుకున్న తర్వాత ముగ్గురు కలిసి మద్యం తాగారు.

అక్కడే ఇంట్లోనే ఉన్న భార్యపై కన్నేసిన ఇద్దరు స్నేహితులు.. ఆమె భర్తకు మరింత మద్యం తాగించారు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత.. ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించిన ఆ మృగాలు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి ఆమెను హత్యచేశారు (Rape And Murder).

మత్తు నుంచి తేరుకున్న అతను విగతజీవిగా పడి ఉన్న భార్యను చూశాడు. ఏమి జరిగి ఉంటుందని ఓ అంచనాకు వచ్చాడు. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్​తో విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

RAIDS ON MASSAGE CENTERS: మసాజ్, స్పా సెంటర్లపై టాస్క్​ఫోర్స్ దాడులు.. 13 మంది అరెస్టు

ABOUT THE AUTHOR

...view details