నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర సమీపంలోని రామకోటయ్య నగర్ నిర్జన ప్రాంతంలో ఓ యువతిపై.. ఓ వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కొడుతున్న ఆ దృశ్యాలను తన స్నేహితుడితో వీడియో తీయించాడు. ఓ వైపు ఇష్టమొచ్చినట్లుగా కొడుతూనే.. మరోవైపు తన స్నేహితుడి కోరిక తీర్చాలంటూ బెదిరించాడు.
స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి
తన స్నేహితుడి కోరిక తీర్చమంటూ.. ఇష్టమొచ్చినట్టుగా కర్రతో కొడుతూ ఓ యువతిని హింసించాడో యువకుడు. అంతటితో ఆగకుండా ఆ ఘనకార్యాన్ని తన మిత్రుడితో కలిసి వీడియో తీయించి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.
స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి
యువతి ప్రాధేయపడుతున్నా వినకుండా కర్రతో పదే పదే దాడి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆపై ఆమెను కొడుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేశాడు. విషయం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతీయువకులు ఎవరు ? దాడి ఎప్పుడు జరిగిందనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చూడండి:Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి ముమైత్ ఖాన్