ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Rape: ఎస్సై పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం! - A young woman was raped in Ongole.

ఎస్సై పిలుస్తున్నాడంటూ ఓ అగంతకుడు.. యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది.

A Man Attempt Rape in Ongole
యువతిపై అగంతకుడు అత్యాచారం

By

Published : May 29, 2021, 8:07 AM IST

స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని ఓ అగంతుకుడు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. ఆమెకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపుతానంటూ బెదిరించాడు. తానేమీ తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా బదులివ్వడంతో.. అతను ఖంగుతిన్నాడు. ఒక్కసారిగా మాట మార్చాడు. ఎస్సై పిలుస్తున్నారు.. స్టేషన్‌కు రావాలన్నాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె అతని బండి ఎక్కింది. కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన అనంతరం ఆమెను బెదిరించాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత గది వద్ద వదిలేశాడు. ఈ విషయాన్ని తనతో పాటు ఉండే స్నేహితులకు ఆ యువతి చెప్పి కన్నీటి పర్యంతమైంది. వాళ్లు ఇచ్చిన ధైర్యంతోపోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఒంగోలులో జరిగింది.

స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడి ఉదంతంపై బాధితురాలు గురువారం రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఈ తరహా ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details