తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ సమీపంలోని రిషిత ఆసుపత్రిలో ఓ సాఫ్ట్ వేర్ యువతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య(Software Engineer suicide) చేసుకుంది. హైదర్శకోట్‌లో నివాసముండే సుదీప్తి అనే అవివాహిత నీరసంగా ఉండటంతో చికిత్చ కోసం ఈ నెల 6న ఆసుపత్రిలో చేరింది. యువతి కోలుకోవడంతో ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో సోమవారం రోజు బయటకు వెళ్లివచ్చిన యువతి రూంలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమా లేదా మరేమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Software Engineer suicide: ఆస్పత్రిలో ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్.. అసలేం జరిగింది? - rangareddy district news
ఆసుపత్రిలో ఓ సాఫ్ట్ వేర్ యువతి ఉరేసుకుని ఆత్మహత్య(Software Engineer suicide) చేసుకున్న ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నీరసంగా ఉండటంతో చికిత్చ కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ డిశ్చార్జ్ సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని(Software Engineer suicide) మరణించింది. వైద్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
suiside