ఫిరంగిపురంలో ప్రేమోన్మాది ఘాతుకం..యువతి, కుటుంబ సభ్యులపై కత్తితో దాడి - ఫిరంగిపురం వార్తలు
21:40 October 23
ప్రేమించాలని కొన్నాళ్లుగా యువతి వెంటపడుతున్న ఏడుకొండలు
Youngman attack on Young woman and family: పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11మందికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. ఫిరంగిపురానికి చెందిన బాలికకు పెళ్లి కుదిరింది. గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టాడు. దీనిపై మాట్లాడుకునేందుకు రెండు కుటుంబాలవారు సమావేశమయ్యారు.
పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని బాలిక తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో మణికంఠ, అతని బంధువులు కర్రలు, రాళ్లతో బాలికతోపాటు ఆమె కుటుంబీకులపై ఒక్కసారిగా దాడి చేశారు. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగటంతో.. మొత్తం 11మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 9మందిని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికతోపాటు ఆమె బంధువుకు తలపై తీవ్ర గాయం కావడంతో గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలిక, ఆమె బంధువులు వెల్లడించారు. మణికంఠ తరఫు వారికి ఒకరికి గాయమైంది..
ఇవీ చదవండి: