హైదరాబాద్లోని బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని బాపూజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గిరీష్ అనే వ్యక్తి యువతిని కత్తితో పొడిచి.. అనంతరం తాను కూడా గాయపరుచుకున్నాడు. తనను ప్రేమించాలని..పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
యువతి ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడడం వల్ల తాము వెళ్లి చూశామని స్థానికులు పేర్కొన్నారు. యువతీ, యువకుడు రక్తపుమడుగులో ఉన్నట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. యువతి స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నట్లు వివరించారు.
దర్యాప్తు ప్రారంభం