ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ATTACK ON YOUNG WOMAN: ప్రేమోన్మాదం.. యువతిపై యువకుడి కత్తి దాడి - secunderabad crime news

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు.

attack on young lady
attack on young lady

By

Published : Aug 4, 2021, 5:01 PM IST

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని బాపూజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గిరీష్ అనే వ్యక్తి యువతిని కత్తితో పొడిచి.. అనంతరం తాను కూడా గాయపరుచుకున్నాడు. తనను ప్రేమించాలని..పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.

ఏం జరిగింది?

యువతి ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడడం వల్ల తాము వెళ్లి చూశామని స్థానికులు పేర్కొన్నారు. యువతీ, యువకుడు రక్తపుమడుగులో ఉన్నట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. యువతి స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నట్లు వివరించారు.

దర్యాప్తు ప్రారంభం

ఈ దాడికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం ఆధారంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మధ్యాహ్నం సమయంలో ఈ దాడి జరిగింది. ఇంట్లో నుంచి పెద్ద అరుపులు వినిపించాయి. వెంటనే మేమంతా వెళ్లి చూశాం. ఆ యువకుడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించాం. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం.

-లక్ష్మి, స్థానికురాలు

ఇదీ చదవండి:

BAIL TO DEVINENI: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

ABOUT THE AUTHOR

...view details