ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

woman missing: భార్య కోసం భర్తల గాలింపు.. అసలేం జరిగిందంటే?

Woman missing in telangana: మొదటి భర్త, పిల్లలను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఇద్దరు భర్తలు గాలించినా ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు ఆమే పోలీస్ స్టేషన్​కు వెళ్లింది. ఎక్కడికెళ్లావు అని మొదటి భర్త అడిగితే మాత్రం.. 'ఆ ఒక్కటీ అడక్కు..' అంటోంది. మరోవైపు ఆ మహిళ కావాలనే నాటకాలు ఆడుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Woman missing in telangana
Woman missing in telangana

By

Published : Jan 2, 2022, 9:31 AM IST

Woman missing in telangana: మొదటి భర్త, పిల్లలను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అదృశ్యమైన ఓ మహిళ ఎట్టకేలకు తెలంగాణలోని ఎస్సార్‌నగర్‌ ఠాణా చేరింది. వరంగల్​లోని కాజీపేటకు చెందిన మహిళ(35)కు హనుమకొండకు చెందిన వ్యక్తి(43)తో 23 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు(16), కుమార్తె(13) ఉన్నారు. కొంతకాలం కిందట అమలాపురానికి చెందిన వ్యక్తితో పరిచయం కాగా.. ప్రేమకు దారి తీసింది.

Husbands Search for Wife : గతేడాది ఆగస్టు 20న ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.లక్ష నగదు తీసుకుని వెళ్లిన ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుని బల్కంపేటలో ఉంటోంది. అయితే మొదటి భర్త తన భార్య నగలు, నగదు తీసుకుని వెళ్లిపోవడంతో హనుమకొండ సుబేదారి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సుబేదారి పోలీసులు మహిళతో పాటు ఆమె రెండో భర్తను అరెస్టు చేసి, జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చాక రెండో భర్తతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. ఇటీవల ఆమె అదృశ్యం కావడంతో అతను హైదరాబాద్​లోని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం మొదటి భర్త, రెండో భర్త గాలించారు.

Two Husbands Search for Wife : మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు మహిళ ఆచూకీ కోసం వెతికారు. శనివారం రోజు ఆ మహిళ తన రెండో భర్తతో కలిసి ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఎక్కడికి వెళ్లావని పోలీసులు అడిగితే ఆమె సరైన సమాధానం చెప్పడం లేదు. ఆ ఒక్కటీ మాత్రం అడగొద్దని చెపుతుంది. తనకు మొదటి భర్త లేడని, పిల్లలు కూడా తన పిల్లలు కారని ఆమె చెప్తోంది. మొదటి భర్త కూడా గాలిస్తున్నందున రెండో భర్తతో కలిసి మహిళే అదృశ్యమైనట్లు నాటకం ఆడుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:Vikarabad SI died in Accident: పెళ్లైన వారం రోజులకే.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details