ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పాఠశాల నుంచి బాలికను కిడ్నాప్ చేసిన మహిళ..! - latest news on woman kidnapped

woman kidnapped 3rd class student: నెల్లూరు జిల్లా దుత్తలూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం రేపింది. మూడో తరగతి విద్యార్థిని కావ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. విద్యార్థిని కిడ్నాప్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదుతో దుత్తలూరు పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 6, 2022, 5:54 PM IST

నెల్లూరు జిల్లాలో బాలిక కిడ్నాప్‌

kidnapped 3rd class student from the school: నెల్లూరు జిల్లా దుత్తలూరులో కావ్య అనే బాలికను.. ఓ మాయలేడి సినీఫక్కీలో కిడ్నాప్‌ చేసింది. ప్రాథమిక పాఠశాల మూడో తరగతి చదువుతున్న కావ్య రోజూలాగే బడికి వెళ్లింది. ఐతే.. మేనత్తనంటూ ఓ మహిళ పాఠశాలకు వెళ్లి కావ్యను పంపాలని కోరింది. నిజమేనని నమ్మి.. ఉపాధ్యాయులు పంపించారు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో.. అనుమానం వచ్చి తల్లిదండ్రులకు కబురు పంపారు. కావ్య తల్లిదండ్రులు ఏదో జరిగిందని అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగంతుకురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details