Wife killed Husband in Medchal : తెలంగాణలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్కు చెందిన ఎస్కే.మౌలానా ఈ నెల 6న మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువుకు దుబాయ్ వెళ్లిన మౌలానా రెండేళ్ల క్రితం తిరిగొచ్చి ఇక్కడే కూలీ పనిచేస్తున్నాడు. తనకు భార్య షానాబీతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. భర్త విదేశానికి వెళ్లిన సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో షానాబీ వివాహేతర బంధం సాగించింది.
Wife Poisoned Her Husband in Ghatkesar : దుబాయ్ నుంచి వచ్చిన భర్త తమ బంధానికి అడ్డుగా మారటంతో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నెల 5న మద్యం కొనుగోలుకు అతను తను భార్యను రూ.100 అడిగాడు. డబ్బులు లేవంటూ ఇంట్లో ఉన్న మద్యం సీసాను షానాబీ తెచ్చి ఇచ్చింది. తాగిన కొద్ది సేపటికే కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో హడావుడిగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది.