కర్నూలు జిల్లా కోడుమూరులో తెలుగుదేశం కార్యకర్తపై దాడి జరిగింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న అశోక్ తనపై దాడికి పాల్పడ్డాడని చిన్నబోయగేరికి చెందిన తెదేపా కార్యకర్త శ్రీనివాస్ ఆరోపించాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. ఆదివారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న సమయంలో తనపై అశోక్ వెనుక నుంచి కొడవలితో దాడి చేశాడని బాధితుడు చెప్పాడు. శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తనకు ప్రాణహాని ఉందని.. ఆదుకోవాలని బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
తెదేపా కార్యకర్తపై వాలంటీర్ దాడి - Kurnool district attack news
కర్నూలు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న అశోక్... తనపై కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు తెలిపాడు. ఆదివారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న సమయంలో తనపై.. అశోక్ వెనుక నుంచి కొడవలితో దాడి చేశాడని బాధితుడు అన్నాడు.
తెదేపా కార్యకర్తపై వాలంటీర్ దాడి