మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్మెట్ కాకతీయనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని యశస్విని(15)... ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల యాజమాన్యం వేధింపులతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు... విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ: మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు
తెలంగాణ మేడ్చల్ జిల్లాలో విషాదం జరిగింది. పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఇంట్లో ఎవరు లేని సమయం చూసి.. అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు