ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SNAKE BITE: పాము కాటుకు.. బలైన ఆశీర్వాదం! - student died of a snake bite

కర్నూలు జిల్లాలో ఆశీర్వాదం అనే ఓ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

SNAKE BITE
ఏనుగుబాలలో పాము కాటుకు విద్యార్థి మృతి

By

Published : Jul 8, 2021, 4:04 PM IST

Updated : Jul 8, 2021, 5:23 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాలలో ఆశీర్వాదం (16) అనే బాలుడు పాము కాటుకు గురయ్యాడు. అతడు ఇంటి వద్ద ఉన్న ఓ బండ దగ్గర కూర్చున్నపుడు అనుకోకుండా చేతిపై పాము కాటు వేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే అతడిని హుటాహుటిన స్థానికంగా ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆరోగ్యం విషమించింది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందాడు.

ఇషాక్, పుష్పమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఆశీర్వాదం మాత్రమే కుమారుడు. నిండా 16 ఏళ్లు కూడా నిండని అతడు పాము కాటుకు బలి కావడంతో తల్లిదండ్రులు గుండెకోతకు గురయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాల మృతి వారిని కుదిపివేసింది. అతడికి కాపాడుకునేందుకు వారు చివరిదాకా శతవిధాలా ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితి చేజారిపోవడంపై కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jul 8, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details