Robbery in Hotel : అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రధాన రహదారిలో ఉన్న పల్లవి హోటల్‌లో చోరీ జరిగింది. వెనుక ద్వారం నుండి దొంగ హోటల్లోకి చొరబడి.. చోరీకి పాల్పడ్డాడు. కౌంటర్లో ఉన్న 40 వేల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఉదయాన్నే యజమాని హోటల్ తలుపు తెరిచి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
హైవేపై హోటల్‌లో చోరీ.. సీసీ టీవీలో దృశ్యాలు - గుంతకల్‌లోని పల్లవి హోటల్‌లో చోరీ
Robbery in Hotel: గుంతకల్ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న ఓ హోటల్‌లో చోరీ జరిగింది. రాత్రి ఎవరూ లేని సమయంలో వెనుక ద్వారం గుండా హోటల్‌లో ప్రవేశించిన దొంగ.. కౌంటర్లోని 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు.
దొంగ