ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కడప కలెక్టరేట్‌లో విశ్రాంత ఏఎస్సై కుమారుడి వీరంగం.. కత్తితో బెదిరిస్తూ... - కడప కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి వీరంగం

psycho halchal in kadapa Collectorate: కడప కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కలెక్టరేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని కత్తితో బెదిరిస్తూ పాలనాధికారి కార్యాలయం అద్దాలు పగులగొట్టాడు. ఈ సమయంలో కేకలు వేస్తూ హడావుడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

psycho halchal in kadapa Collectorate
psycho halchal in kadapa Collectorate

By

Published : Jan 19, 2022, 5:30 AM IST

syco halchal in kadapa Collectorate: కడప కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కడపకు చెందిన మురళీకృష్ణ కలెక్టరేట్‌లోకి కత్తి, సుత్తి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. కలెక్టర్‌ను కలిసేందుకు లోపలికి చొరబడుతుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. దీంతో వారిని కత్తితో బెదిరించి కలెక్టర్‌ ఛాంబర్‌ ప్రధాన ద్వారం అద్దాలు పగులగొట్టాడు. ఈ సమయంలో కేకలు వేస్తూ హడావుడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వ్యక్తి విశ్రాంత ఏఎస్సై అప్పన్న కుమారుడని పోలీసులు తెలిపారు. మురళీకృష్ణను రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిని మానసిక వైద్యాలయానికి పంపించాలని వైద్యులు సిఫార్సు చేసినట్లు తెలిసింది. కువైట్‌లో పని చేస్తున్న మురళీకృష్ణ ఇటీవలే కడపకు వచ్చాడు. రవాణా శాఖ కార్యాలయంలో తనకు డ్రైవింగ్ లైసెన్స్‌ ఇవ్వలేదనే ఆక్రోశం కూడా అతడిలో కనిపిస్తోందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి:రోకలిబండతో కొట్టి.. పెట్రోల్​ పోసి తగలబెట్టి

ABOUT THE AUTHOR

...view details