తెలంగాణలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్‌లో ఓ మహిళపై పెట్రోల్ లాంటి ద్రావణంతో దాడి జరిగింది. ఈ దాడి కేసులో ప్రధాన నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రకటించారు. ఆర్థిక లావాదేవీలే అందుకు కారణం అని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ: మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు - మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు
ఓ దుండగుడు ఓ మహిళపై పెట్రోల్ లాంటి ద్రావణంతో దాడి చేశాడు. డబ్బుల గురించి చర్చించేందుకు వెళ్లినపుడు గొడవ జరిగి.. ఆ ద్రావణం ఆమెపై పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది.

మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు
పశువుల వ్యాపారం చేసే సాదత్తో ఆమెకు డబ్బు లావాదేవీలపై వివాదాలున్నాయి. రాత్రి డబ్బుల లావాదేవీల గురించి మాట్లాడేందుకు ఇద్దరూ వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెట్రోల్ వంటి ద్రావణం మహిళ ముఖంపై పోసి నిప్పంటించాడని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సాదత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.
ఇదీ చూడండి :వజ్రపుకొత్తూరులో మహిళ అపహరణకు విఫలయత్నం