A person Attacked Police: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఏకంగా పోలీసులనే చంపబోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం రాత్రి నార్సింగి వద్ద బైకుపై వెళ్తున్న ఇద్దరిపై.. దోపిడీ దొంగల ముఠా తల్వార్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిశోర్ అనే వ్యక్తి మృతి చెందగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే నిందితుడు జగద్గిరిగుట్టలో ఉన్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
దర్యాప్తునకు వెళ్లిన కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి - Attack on police with talwar is the latest news
A person Attacked Police: తెలంగాణ రాష్ట్రంలోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ఓ కేసు విషయంపై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఓ వ్యక్తి తల్వార్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయమై మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుల్స్ రాజు, విజయ్‌లు నిందితుడిని పట్టుకునేందుకు ఆల్విన్ కాలనీకి వెళ్లారు. ఈ క్రమంలోనే కరణ్‌సింగ్ తల్వార్‌తో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో రాజుకు ఛాతిపై, తలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయ్ స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: