ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఇంటి బయట తాళం.. వంటింట్లో మృతదేహం! - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా చీరాలలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాళం వేసి ఉన్న ఇంట్లోంచి దుర్వాసన వస్తుండంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా... విషయంగా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎవరో గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

woman killed
వంటింట్లో మృతదేహం

By

Published : May 15, 2021, 8:47 PM IST

తాళం వేసి ఉన్న ఇంట్లో ఓ మహిళ మృతిచెందింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని బందావారి వీధిలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న చీరాల ఒకటో పట్టణ పోలీసులు.. ఇంటి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లగా మహిళ మృతదేహం కనిపించింది.

ఇంట్లో కర్నాటి విజయలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించడంతో.. విస్తరాకులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటుందని స్థానికులు తెలిపారు. అసలు ఆమెను ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్​లు వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలు ఒక్కతే ఒంటరిగా ఇంట్లోనే ఉంటుందని.. ఎవరో గొంతునులిమి ఆమెను హత్యచేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details