Woman, 3 kids jump into canal: కుటుంబ తగాదాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి జూరాల కాల్వలో దూకింది. ఈ విషాద ఘటన.. తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా.. కాల్వలో కొట్టుకుపోతున్న బాలుడిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గల్లంతైన వారిని గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులే ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలో దూకిన తల్లి
Woman, 3 kids jump into canal: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి జూరాల కాల్వలో దూకింది.ఘటనలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా.. కాల్వలో కొట్టుకుపోతున్న బాలుడిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.
ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలో దూకిన తల్లి