ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పిల్లలకు వాతలు పెట్టిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు - హైదరాబాద్​ నేర వార్తలు

భర్తపై కోపాన్ని ఓ గృహిణి.. తన పిల్లలపై చూపించింది. చిన్నారులని చూడకుండా గిన్నె కాల్చి అరికాళ్లు, తొడలపై వాతలు పెట్టింది. ఈ ఘటన హైదరాబాద్​లోని.. సనత్​నగర్​ ఠాణా పరిధిలో జరిగింది.

a-mother
a-mother

By

Published : Feb 27, 2021, 9:49 AM IST

భర్తతో గొడవపడిన ఓ మహిళ... ఆ కోపాన్ని పిల్లలపై చూపింది. హైదరాబాద్​లోని సనత్​నగర్​ ఠాణా పరిధి బోరబండ రామారావునగర్​కు చెందిన పావని, రాజు దంపతులు. వీరికి జ్ఞానేశ్వర్​, మహాలక్ష్మి ఇద్దరు పిల్లలు. ఈనెల 23న భర్తతో గొడవ పడిన పావని ఆ కోపాన్ని చిన్నారులపై ప్రదర్శించింది.

గిన్నెను కాల్చి పిల్లలిద్దరి అరికాళ్లు, తొడలపై వాతలు పెట్టింది. గమనించిన స్థానికులు తల్లిని మందలించారు. ఈ విషయాన్ని స్థానిక అంగన్​వాడీ టీచర్​.. మేడ్చల్​ జిల్లా కార్యాలయంలోని లీగల్​ ప్రొఫెషనల్​ అధికారికి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details