Danger Game In Vikarabad Resort : తెలంగాణలోని వికారాబాద్ చుట్టూ రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ రిసార్టుల్లో నిర్వహించే డేంజర్ గేమ్స్ యువకుల పాలిట శాపంగా మారాయి. తాజాగా నిన్న రాత్రి ఓ రిసార్టులో ఈ డేంజర్ గేమ్ వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గోధుమగూడలోని రిసార్ట్‌లో అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో భాగంగా డేంజర్ గేమ్ ఏర్పాటు చేశారు. దూరంగా పడేసిన వస్తువును తీసుకురావడమే ఈ డేంజర్ గేమ్ టార్గెట్.
రిసార్ట్‌లో డేంజర్ గేమ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం - డేంజర్ గేమ్
Danger Game In Vikarabad Resort : రిసార్టుల్లో నిర్వహించే డేంజర్ గేమ్స్ యువకుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా వికారాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో నిర్వహించిన డేంజర్ గేమ్‌లో పాల్గొని ఓ సాఫ్ట్వేర్ మరణించాడు. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే?
అందులో పాల్గొనడానికి నిన్న సాయంత్రం రిసార్టుకు దాదాపు వందమంది యువకులు వచ్చారు. అందరూ కలిసి ఈ గేమ్ ఆడారు. ఈ క్రమంలో రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టారు. దానిని వెతికి తీసుకువద్దామని సాయికుమార్ అనే యువకుడు బావిలోకి దూకాడు. బావిలోకి దూకిన సాయికుమార్(34) దురదృష్టవశాత్తు ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: