సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బస్ స్టాప్‌లో రెండు బస్సుల మధ్య నలిగి ఓ వ్యక్తి మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని ఓ బస్ స్టాప్‌లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వస్తుండగా... రెండు బస్సుల మధ్య చిక్కి వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో దుర్గారావు అనే వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతి చెందారు.