హైదరాాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2వేల రూపాయల కోసం జరిగిన గొడవలో... ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు (Murder in Musheerabad). పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను(27) బతుకుతెరువు కోసం ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ముషీరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆ ప్రాంతంలోనే మటన్‌షాప్‌లో పనిచేసే అల్తాఫ్ ఖాన్‌తో సోనూ పరిచమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి ముషీరాబాద్‌లో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
murder in Hyderabad: రూ.2 వేల కోసం.. స్నేహితుడి గొంతు కోసి హత్య - ముషీరాబాద్‌లో వ్యక్తి హత్య
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు (Murder in Musheerabad). మద్యం మత్తులో డబ్బుల విషయంలో గొడవపడి సోను అనే యువకుడినీ అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు (a man murder his room mate).

కొన్ని రోజుల క్రితం అల్తాఫ్ ఖాన్.. సోనూకు రూ.2వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని అల్తాఫ్ అడుగుతున్నప్పటికీ.. సోనూ దాటవేస్తూ వచ్చాడు. గురువారం రాత్రి సోనూ, అల్తాఫ్ ఇద్దరూ గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహానికి గురైన అల్తాఫ్... సోనూను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు (a man murder his room mate). అనంతరం అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి:ఒకే ఇంట్లో ఇద్దరు మృతి..మరో ఇద్దరికి అస్వస్థత.. కారణమేంటి..?