FRAUD: రైల్వేలో టీసీ, క్లర్కు తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు 10 మంది నుంచి 15 లక్షల రూపాయలు తీసుకొని నిందితుడు పారిపోవడంతో బాధితులు డీఎస్పీని ఆశ్రయించారు. ఆధారాలు, వీడియోలు అన్ని సమర్పించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డీఎస్పీ చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.
FRAUD: రండిబాబూ రండి అన్నాడు.. అందరూ వెళ్లి బుట్టలో పడ్డారు! - వైఎస్ఆర్ జిల్లా తాజా వార్తలు
FRAUD: ఒకతను ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇది మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అది నిజమని నమ్మిన కొంతమంది అతడికి డబ్బులు ఇచ్చారు. ఐదేళ్లు దాటినా ఉద్యోగం రాకపోవడంతో అతడిని నిలదీశారు. అప్పుడు కూడా మాటలతో నమ్మించి బురిడి కొట్టించాడు. మీకు ఉద్యోగం రాకుంటే నా ఇల్లు అమ్మి మీ డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఆ మాటలను కూడా వాళ్లు నమ్మారు. ఇంకేముంది ఎవరికి తెలియకుండా ఇల్లు అమ్మి పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇదీ జరిగింది :వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని నాగలకట్టకు చెందిన జోయల్ దాస్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 2016 సంవత్సరం నుంచి ఈ తరహా మోసం కొనసాగుతోంది. ఇది మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాయమాటలు చెప్పి నమ్మించి.. ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఐదేళ్లు దాటినా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. అప్పుడు కూడా మాటలతో నమ్మించి బురిడి కొట్టించాడు. మీకు ఉద్యోగం రాకుంటే నా ఇల్లు అమ్మి మీ డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. దాంతో బాధితులు కొన్ని రోజులు ఆగారు. ఇదే మంచి సమయం అనుకొని ఎవరికీ తెలియకుండా ఇల్లు అమ్మి పరారయ్యాడు. అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి డీఎస్పీ నాగరాజును కలిశారు.
ఇవీ చదవండి: