విశాఖ జిల్లా కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఊర్వశి కూడలి వద్ద బైక్ను లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి.. లారీ వెనక చక్రం కింద పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
బైక్ను లారీ డీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
బైకును ఢీకొట్టిన లారీ