‘ఇద్దరం ప్రేమించుకున్నాం.. కొంతకాలం కలిసి ఉన్నాం, ఒక్కసారిగా ఇప్పుడు నన్ను కాదంటోంది..’ అంటూ ఓ వివాహితుడు... ప్రేమించిన గృహిణి ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్‌కి చెందిన నాగోల్ వాసి సురేశ్ (35) హిమాయత్‌నగర్‌లోని ఓ జిరాక్స్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో యాదవ గల్లీకి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ముగ్గురు పిల్లలున్నారు. సురేశ్‌కు సైతం.. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కొన్నాళ్ల క్రియం ఆ యువతితో సురేశ్ కు పరిచయం ఏర్పడింది. ఏడు నెలలు కలిసిమెలిసి తిరిగారు. ఇటీవల ఆ మహిళ మళ్లీ తన భర్త వద్దకు వెళ్లింది. ఆమె కోసం సురేశ్ భార్యతో గొడవ పడ్డాడు.
ప్రియురాలి కోసం... ఆత్మహత్యాయత్నం..
ప్రేమించిన మహిళకు మూడు నాలుగు రోజులుగా ఫోన్ చేస్తుంటే మాట్లాడటం లేదు. ప్రస్తుతం కుటుంబంతో నేను ఆనందంగా ఉన్నా.. మన సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె చెప్పడంపై.. సురేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. స్థానికులు నచ్చజెప్పి పంపించేశారు. ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్ సీసాతో వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు. ఆమె కోసం చచ్చిపోతానంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
చికిత్స పొందుతూ మృతి..