ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వ్యక్తి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా ? - kadapa crime news

కడప జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తల, మెడపై గొడ్డలితో దాడి చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

murder
వ్యక్తి దారుణ హత్య

By

Published : May 9, 2021, 11:39 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె ప్రకాశ్​నగర్‌ వద్ద కైపు వెంకటేశ్ (43) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. తల, మెడపై గొడ్డలితో అతనిపై కిరాతకంగా దాడి చేశారు. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య సమాచారం అందుకున్న సీఐ బీవీ చలపతి, ఎస్సై వెంకటరమణలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కైపు వెంకటేశ్ గురించి కుటుంబసభ్యులు, గ్రామస్థులతో ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details