ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దంపతులపై రోకలిబండతో దాడి.. భర్త మృతి - వ్యక్తి దారుణ హత్య తాజా వార్తలు

కడప జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని వ్యక్తి రోకలిబండతో దాడి చేయడంతో భర్త అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మృతుడి భార్య పరిస్థితి విషమంగా ఉంది.

a mam attacked wife and husband
భార్య భర్తలపై రోకలిబండతో దాడి

By

Published : Jul 15, 2021, 10:41 AM IST

Updated : Jul 15, 2021, 12:26 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గొల్లపల్లిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలతో హత్య జరిగినట్లు తెలుస్తోంది.

గొల్లపల్లికి చెందిన కృష్ణారెడ్డి దంపతులు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రోకలిబండతో దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డి భార్య శ్రీలేఖను కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బద్వేలు ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 15, 2021, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details