ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి - ప్రేమ పేరుతో యువతిపై అటాక్​

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌ పరిధి హైదర్‌షాకోట్​లో దారుణం జరిగింది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో... ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన యువతి తల్లిపైనా కత్తి దూశాడు. స్థానికులు యువకుడిని పట్టుకోగా... యువతికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

a-lover-attacked
a-lover-attacked

By

Published : Mar 3, 2021, 10:52 AM IST

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

ప్రేమ పేరుతో యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ ఉన్మాది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి హైదర్‌షా కోట్‌లో... ప్రేమించాలంటూ యువతి వెంటపడి... ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంటికే వెళ్లి దాడి చేశాడు. అడ్డొచ్చిన యువతి తల్లినీ కత్తితో గాయపరిచాడు.

సెలూన్‌లో పరిచయం

హరియాణాకు చెందిన షారుక్‌ సల్మాన్‌ సన్‌సిటీలో నివాసం ఉంటున్నాడు. నార్సింగి పరిధిలోని హైదర్‌షా కోట్‌లో ఉన్న ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాధితురాలు తరుచూ సెలూన్‌కు వెళ్తుండేది. అప్పుడే షారుక్‌ సల్మాన్‌తో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకుని ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు యువతి అతనికి నచ్చజెప్పినా వినకపోవడంతో తండ్రికి విషయం చెప్పింది.

పట్టుకున్న స్థానికులు

అతని తీరుపై యువతి తండ్రి షీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. అది భరించలేని సల్మాన్‌ గతరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను మాటల్లో పెట్టాడు. అంతలోనే వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి వీపుకు గాయమైంది. అడ్డువచ్చిన తల్లికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దాడి అనంతరం అక్కడి నుంచి సల్మాన్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగా వాచ్‌మెన్‌ అడ్డొచ్చాడు. అతడినీ కత్తితో బెదిరించి పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

సంజయ్ పరామర్శ

లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను.. మెరుగైన వైద్యం కోసం సోమాజీగూడలోని యశోధా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు బాధితురాలిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించారు.

ఇదీ చూడండి:

విశాఖ సహా 10 పోర్టులపై ప్రైవేటు ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details