తెలంగాణలోని మహబూబ్ నగర్ పట్టణంలో బుధవారం అర్థరాత్రి హత్య జరిగింది. పట్టణంలోని భగీరథ కాలనీ, షాసాహెబ్ గుట్ట రహదారిపై పసుల క్రిష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌కు సమీపంలో నరహరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరహరిని కారుతో ఢీకొట్టి, అనంతరం కత్తులతో దాడి చేశారు. అక్కడికక్కడే అతను మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారుని దుండగులు సంఘటనా స్థలం వద్దే వదిలేసి వెళ్లిపోయారు. వ్యాపార, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.