గుంటూరు జిల్లాలో ఆగివున్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి - రోడ్డు ప్రమాదం
16:57 August 15
విజయవాడ నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా ప్రమాదం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.
ఇవీ చదవండి: