Car Accident: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఘోరం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న14నెలల చిన్నారిపై కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. డ్రైవర్ ఆ కారును అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతోనే చిన్నారి ప్రాణాలు పోయాయని బాధిత చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపించారు.
హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు..! - రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి
Car Accident: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
![హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు..! road accident at sanath nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15666137-413-15666137-1656269423645.jpg)
రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ రసూల్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: