ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. రమణ కాలనీ సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన బత్తుల నరసింహారావు అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు పొడిచి చంపారు. బి.సి కాలనీకి చెందిన నరసింహారావు నందిగామ కాకతీయ స్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. సమాచారం అందుకున్న నందిగామ సీఐ కనకారావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Murder: నందిగామలో బాలుడు దారుణహత్య.. ఎవరి పని..? - ap latest news
Murder in Nandigama: 15 ఏళ్ల బాలుడు.. జాతీయ రహదారి సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు.. దీంతో రక్తపు మడుగులో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
1