ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కర్నూలు జిల్లాలో దారుణ హత్య.. బీజేపీ నాయకుడు మృతి - కర్నూలు జిల్లాలో దారుణ హత్య

Bjp leader murder in Kurnool district: కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు.. బీజేపీ నాయకుడి కళ్లల్లో కారం కొట్టి, వేట కొడవళ్ళతో దాడి చేశారు. దాడిలో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Kurnool district
కర్నూలు జిల్లాలో దారుణ హత్య

By

Published : Jan 7, 2023, 10:50 PM IST

BJP leader murdered in Kurnool distric: కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంభలనూరుకు చెందిన బీజేపీ నాయకుడు ఈడిగ శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. కుంభలనూరు గ్రామంలోని ఓ కల్లు దుకాణం దగ్గర గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి, వేట కొడవళ్ళతో తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తలకు తీవ్రగాయాలు కావడంతో ఈడిగ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు 8 నెలల క్రితం నదిచాగి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామన్న గౌడ్ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 4 నెలల క్రితం వైసీపీ వర్గపోరుతో బీజేపీలో చేరాడు. ఈ క్రమంలో ఈడిగ శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురికావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువులతో హత్యకు గల కారణాలపై డీఎస్పీ వినోద్ కుమార్ ఆరా తీశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details