ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ACCIDENT: రోడ్డు ప్రమాదంలో సోదరుడు మృతి... చెల్లెలికి తీవ్రగాయాలు - accident at chilakaluripeta

accident in guntur
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

By

Published : Sep 17, 2021, 10:27 AM IST

Updated : Sep 17, 2021, 12:32 PM IST

10:23 September 17

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

 సోదరిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న అన్న...రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘటన కంటతడిపెట్టించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బత్తిన మౌనికను...తన అన్న కుమారస్వామి ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్తున్నాడు. పరీక్ష కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందగా.. మౌనికకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స కోసం గుంటూరు తరలించారు. కుమారస్వామి చిలకలూరిపేటలో టీ స్టాల్ నడుపుతూ.. కుటుంబానికి అండగా ఉంటున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న సోదరుడు మృత్యువాత పడటంతో ఆ సోదరి విలవిలలాడిపోయింది.  

ఇదీ చదవండి..

Fire Accident: పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Last Updated : Sep 17, 2021, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details