తెలంగాణ యాదాద్రి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం శివారులో అర్ధరాత్రి నిర్వహించిన రేవ్‌పార్టీ.. కలకలం సృష్టించింది. ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిపిన రేవ్‌పార్టీపై స్థానికులు ఫిర్యాదు చేయగా... పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 90 మందితో పాటు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ: శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది.. - ఫామ్‌హౌజ్
శివరాత్రి రోజున అందరూ ఉపవాసంతో, భక్తిపారవశ్యంలో మునిగిపోతే... కొందరు యువత మాత్రం రేవ్‌పార్టీలో మాదకద్రవ్యాల మత్తులో తేలిపోయారు. తెలంగాణ యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి సుమారు 90 మందికి అదుపులోకి తీసుకున్నారు.
శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..
పట్టుబడిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలుండగా... మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిలో చాలా మంది నిషేధిత డ్రగ్స్, మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు, డేజే వాహనం, వంట సామగ్రి, 60 ద్విచక్రవాహనం, 14 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై సీపీ మహేశ్ భగవత్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.