80 lakh stolen from a private bus: ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రూ. 80లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారి.. హైదరాబాద్ వస్తోన్న అతను మేడ్చల్ వద్ద తన బ్యాగ్ లేకపోవడం గమనించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బస్సు దారిలో ఎక్కడెక్కడ ఆగిందో అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొదట డిచ్పల్లిలో ఓ డాబా వద్ద బస్సు ఆగిన ప్రదేశంలో సీసీ పుటేజ్ పరిశీలించారు.
ప్రైవేట్ బస్సులో రూ.80 లక్షలు మాయం.. లబోదిబోమంటున్న వ్యాపారి - ఏపీ నేర వార్తలు
80 lakh stolen from a private bus: ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రూ. 80లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారి.. హైదరాబాద్ వస్తున్న అతను మెడ్చల్ వచ్చేసరికి తన బ్యాగ్ లేకపోవడంతో కంగుతిన్నాడు. దీంతో అతను డిచ్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు బస్సు ప్రయాణించే మార్గాల్లో సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు.
![ప్రైవేట్ బస్సులో రూ.80 లక్షలు మాయం.. లబోదిబోమంటున్న వ్యాపారి Theft of money](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16824936-508-16824936-1667481983087.jpg)
ప్రైవేట్ బస్సులో రూ.80 లక్షల చోరి
ఆ తరువాత ఇందల్ టోల్ ప్లాజా వద్ద ఉన్న నిఘానేత్రాలు పరిశీలించారు. ఎక్కడ పోలీసులకు దొంగతనం జరిగే ఆనవాళ్లు లభించకపోవడంతో.. ఆ వ్యాపారి చేసేది ఏం లేక అదే బస్సులో హైదరాబాద్ వెళ్లినట్లు డిచ్పల్లి సీఐ మోహన్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వ్యాపారి పేరు గాని అతను ఏ ప్రాంత వాసి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: