8 vehicles collided with each other: విపరీతంగా కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొదట ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. అది చూసిన వెనక లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వరుసగా ఉన్న ఆర్టీసీ బస్సులు, లారీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా దారి మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం పోలీసుల క్రేన్లు తెప్పించి వాహనాలను రహదారిపై తొలగించే చర్యలు చేపట్టారు.
16వ నంబర్ జాతీయ రహదారి.. వరుసగా ఢీకొన్న ఎనిమిది వాహనాలు.. - Ganapavaram Latest News
8 vehicles collided with each other: పొగ మంచు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వరుసగా ఎమినిది వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. మొదట ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వరుసగా ఉన్న ఆర్టీసీ బస్సులు లారీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
16వ నంబర్ జాతీయ రహదారిపై ఒకదానినొకటి ఢీకొన్న 8 వాహనాలు