తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పనూతల మండలం పెరట్వాన్పల్లి శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో.. ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారం గేటుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడు నరేశ్‌ను హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్నేహితులు నరేశ్, వంశీ, వెంకటేశ్, కార్తీక్ గురువారం శ్రీశైలం వెళ్లారు. శుక్రవారం మధ్నాహ్నం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నుంచి శివకుమార్, సుబ్బలక్ష్మి, లవకుమార్, వెంకటరమణమూర్తి కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టడంతో.. శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ముగ్గురు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు వెలికి తీశారు.
అతి వేగమే కారణమా..