అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా.. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ తనిఖీ సిబ్బంది... కువైట్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.