ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పెండింగ్​లో 61 చలాన్లు... ద్విచక్రవాహనం సీజ్ - Bhadrachalam bike challan pending

లాక్ డౌన్ లో భాగంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ ద్విచక్రవాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు చూసి అవాక్కయ్యారు. సదురు బైక్​పై ఏకంగా 61 చలాన్లు ఉన్నాయి. పోలీసులు బండిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

bike seize
బైక్ స్వాధీనం

By

Published : May 25, 2021, 7:47 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెండింగ్ చలానాలతో తిరుగుతున్న ఓ యువకుడి ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో పాత కూరగాయల మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా… ఓ మోటార్ సైకిల్​ను నడుపుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బండిని చాసిస్ ఆధారంగా చెక్ చేయగా… 61 చలాన్లు, రూ. 15,535 పెండింగ్​లో ఉన్నట్లు తేలగా పోలీసులు షాక్ అయ్యారు.

నిందితుడు రాజీవనగర్​కు చెందిన గుడిపల్లి నిఖిలేశ్​గా గుర్తించారు. చలాన్లు చెల్లించకుండా… నంబర్ ప్లేట్లు తీసివేసి తిరుగుతున్నందున కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి

అనంతలో బంగారం పేరుతో కోట్లు కాజేసిన దంపతులు

ABOUT THE AUTHOR

...view details